Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు దర్గామిట్టలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుండి జరిగే దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని నెల్లూరు నగర మేయర్ స్రవంతి దంపతులను ఆహ్వానించారు… ఆలయ ఛైర్మైన్, ఈఓ, అర్చకులు, కమిటి సభ్యులు. బుధవారం మేయర్ ను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని ఆమె ఛాంబర్ లో కమిటి సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మరో వైపు నెల్లూరుకు విచ్చేసిన ఎంపి విజయసాయి రెడ్డిని మేయర్ స్రవంతి, వైసీపి నేత జయవర్ధన్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.
