Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వ విద్యాలయంలో ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను వైసీపి ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని, ఆ సెంటర్ కు సీమెన్స్ కంపెనీకు ఎలాంటి సంబంధమే లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సోమిరెడ్డి మాటలు విని టిడిపి నేతలు అబాసుపాలు కావద్దంటూ హితవు పలికారు. గురువారం టిడిపి నేతలు సోమిరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు విక్రమ సింహపురి యూనివర్శిటీలోని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను సందర్శించి, స్కిల్ లో స్కాం ఉంటే ఈ పరికరాలు ఎలా వచ్చాయంటూ వైసీపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం యూనివర్శిటీలోని స్కిల్ సెంటర్ ను సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చెప్పిన విధంగా జిల్లాలో కేవలం రెండు స్కిల్ సెంటర్లకు మాత్రమే ఇనుమతి ఇచ్చారన్నారు. గూడూరులోని ఆదిశంకర కాలేజీ, నెల్లూరులో పాలిటెక్నిల్ కళాశాలలో మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం నడుస్తున్న స్కిల్ స్కాంకు విక్రమ సింహపురి యూనివర్శిటీలోని స్కిల్ సెంటర్ కు సంభందం లేదని మంత్రి కాకాణి పేర్కొన్నారు. వైసీపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పూర్తిగా ఏపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ సెంటర్ ను ఏర్పాటు చేశామని, ఆ భవనం కూడా తిరుపతి ఎంపి గురుమూర్తి సమకూర్చిన నిధుల ద్వారా నిర్మించామని తెలిపారు. కనీస పరిజ్ఞానం లేకుండా సోమిరెడ్డి మాటలు విని టిడిపి నేతలు కట్టు కథలు అల్లారని విమర్శించారు.
