రేపే ఆదిత్య – L1 ప్రయోగం : మొదలైన కౌంట్ డౌన్

Clock Of Nellore ( Srihari Kota ) – సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య-L1 ఉప గ్రహ ప్రయోగానికి నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష కేంద్రంలో సర్వం సిద్ధమైంది. ఈనెల 2వ తేదీ ఉదయం 11: 50 గంటలకు షార్ లోని 2వ ల్యాంచ్ ప్యాడ్ నుండి PSLV-C57 రాకెట్ ఆదిత్య – L1 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంభందించి ఇవాళ మధ్యాహ్నం 12: 10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 23 గంటలా 40 నిముషాల సుదీర్ఘ కౌంట్ డౌన్ అనంతరం PSLV-C57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ప్రవేశిస్తుంది. ఆదిత్య – L1 ఉప గ్రహాన్ని నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు ఆదిత్య – L1 ఉపగ్రహాన్ని దశల వారీగా కక్ష్యలను పెంచుతూ భూమికి, సూర్యుడికి మధ్యలో 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండే L1 పాయింట్ వద్ద ఉంచనున్నారు. అక్కడి నుండే ఆదిత్య – L1 ఉప గ్రహం సూర్యుడిపై అధ్యయనం చేయనుంది. మరో వైపు ఆదిత్య – L1 మిషన్ ప్రయోగం నేపద్యంలో ఇస్రో ఛైర్మైన్ సోమనాథ్ ఇప్పటికే శ్రీహరికోటలోని షార్ సెంటర్ కు చేరుకున్నారు. ప్రయోగం విజయవంతం కావాలని కాంక్షిస్తూ సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ప్రయోగం విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు.

 

Reporter – K. Prudhwi Kumar

 

Read Previous

అపోలో హాస్పిటల్ లో అవయవదానం : చనిపోయి నలుగురికి ప్రాణదానం చేసిన మహిళ

Read Next

రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమార్కులు : 30వేలు లంచం తీసుకుంటూ పట్టుబట్ట సబ్ రిజిస్ట్రార్

Leave a Reply

Your email address will not be published.