నెల్లూరుకు ఎలక్ట్రానిక్ సిటీ బస్సులు : కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

Clock Of Nelore ( Nellore ) – పిఎం ఈ బస్ సేవా పథకం ద్వారా నెల్లూరు నగరానికి ఈ – సిటీ బస్సులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 169 నగరాలకు మొత్తం 10వేల ఈ బస్సులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. 3లక్షలకు పైబడి జనాభా ఉన్న ప్రతీ నగరానికి ఈ బస్సుల కేటాయింపు వర్తిస్తుందని కేబినెట్ వెల్లడించింది. దీని ప్రకారం నెల్లూరు నగరానికి కూడా బస్సులు కేటాయింపు జరగనుంది. నెల్లూరు నగర జనాభా 7 లక్షలకు పైబడి ఉంది. అయితే ఎన్ని బస్సులు కేటాయిస్తారో ఇంకా చెప్పలేదు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ బస్సులు నడపనున్నట్లు కేంద్రం తెలియజేసింది. 

 

Reporter – P. Eswar

Read Previous

ఈ నెలాఖరులోపు 12వేల ఇళ్లు సిఎం చేతుల మీదుగా ప్రారంభోత్సం

Read Next

చంద్రయాన్ లో కీలక ఘట్టం : ప్రొపల్షన్ నుండి విడిపోయిన ల్యాండర్

Leave a Reply

Your email address will not be published.