టిడిపి ప్రభుత్వంతోనే ప్రజాస్వామ్య మనుగడ : వెల్లడించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమని లేదంటే రాష్ట్రంలో ప్రజలు మనుగడ సాధించే పరిస్థితే ఉండదని నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ మరియు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( Kotamreddy Sridharreddy ) అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలపై ఉందని కోరారు. శుక్రవారం నెల్లూరు రూరల్ మండలం, సజ్జాపురంలో మహాశక్తి చైతన్య రథయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ మహిళలతో జరిగిన సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మారిందంటే దానికి కారణం ఎవరనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని, రానున్న ఎన్నికల్లో ప్రపంచంలోనే గర్వించదగ్గ రాజధాని అమరావతి నిర్మాణకర్త అయిన చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని సూచించారు. మహాశక్తి పేరుతో మహిళలకు ప్రకటించిన పథకాలు మహిళా అభ్యుదయానికి పాటుపడతాయని కోటంరెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో రూరల్ నుండి తాను పోటీ చేస్తున్నానని, నిత్యం మీ బిడ్డగా మీతోనే ఉండే తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Read Previous

గర్భవతి అయిన 7వ తరగతి విద్యార్ధి : బెదిరించి అత్యాచారం

Read Next

నెల్లూరు రూరల్ టిడిపిలోకి వలసలు : ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.