Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర మేయర్ స్రవంతి జన్మదిన వేడుకలు శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పలువురు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి పుట్టిన రోజు శుభాాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేషన్ ఉద్యోగులు, పలువురు కార్పొరేటర్లు, నేతలు ఆమెను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు అభిమానులు మేయర్ దంపతులను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి కేక్ కట్ చేసి అక్కడి వారికి పంచిపెట్టారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు టిడిపి నేతలు కూడా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు వైసీపి కార్పొరేటర్లు, నేతలు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
