రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే : మహాశక్తి సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లనుందని టిడిపి నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు మహిళలకు పెద్దపీట వేస్తూ మహాశక్తి పేరుతో అనేక పథకాలను రూపొందించారన్నారు. నెల్లూరు రూరల్ మండలం, కొమ్మరపూడిలో శనివారం కోటంరెట్టి మహాశక్తి చైతన్య రథయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న వైసీపి ప్రభుత్వంలో ప్రజలు ఎలా దోపిడీకి గురౌతున్నారో వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు పథకాలను రూపొందించారన చెప్పారు. ఆడిబిడ్డ నిథి పేరుతో మహిళలకు ప్రతీ నెలా నగదు, దీపం పేరుతో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, తల్లికి వందనం పేరుతో ఇంట్లోని ప్రతీ బిడ్డకు 15వేలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు కోటంరెడ్డి తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. రూరల్ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్ధిగా తానే బరిలో ఉంటున్నట్లు తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

 

Read Previous

ముగిసిన బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ : అధికారులకు ఎంపి ప్రశంసలు

Read Next

గూడూరులో వ్యక్తి దారుణ హత్య : కాపు కాసి కళ్లల్లో కారం కొట్టిన దుండగులు

Leave a Reply

Your email address will not be published.