కుట్రలు తెలియవు… పని చేయడమే తెలుసు : ఎంపి ఆదాల వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు తెలియవని, పని చేయడమే తెలుసునని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు 19వ డివిజన్లో మంగళవారం మూడు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లక్ష్మీనారాయణ, పచ్చ రవి, శ్రీధర్ రెడ్డి, కుమార్, కొండేటి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ 19వ డివిజన్లో 32 లక్షల రూపాయలతో 3 సిమెంట్ రోడ్లు నిర్మించనున్నామని తెలిపారు. 2 కోట్ల 70 లక్షల రూపాయలతో పనులు పూర్తయ్యాయని, కోటి 50 లక్షలు రూపాయలతో పనులు మంజూరు చేయనున్నామని తెలిపారు. ఇంకా అవసరమైతే పనులు చేపడతామని చెప్పారు. వీటిని రానున్న ఎన్నికల్లోపు పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమమే కాకుండా అభివృద్ధికి కూడా నిధులు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి సచివాలయానికి 40 లక్షల రూపాయలు ఇస్తున్నారని, అవసరమైతే ఇంకో 20 లక్షలు రూపాయలు కూడా ఏదో ఒక నిధి నుంచి ఇస్తున్నారని తెలిపారు. గడప గడపలో ఎక్కడికి వెళ్లినా చిరునవ్వులు కనిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్ల నుంచి ప్రజలను చూస్తున్నానని, వారి ముఖాలు చూస్తేనే పరిస్థితి అర్థం అయిపోతుందని అన్నారు. కొందరు మినహా 80 శాతం మందికి పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఇతర రాష్ట్రాల్లో చాలామంది ఇబ్బంది పడ్డారని, అయితే అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో ఎంతో మందికి ఆర్థిక సహాయం చేకూరిందని సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న ఆరు నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్లు అవినాష్, నూనె మల్లికార్జున యాదవ్, వైసీపీ నేతలు లక్ష్మీనారాయణ, పచ్చ రవి, శ్రీధర్ రెడ్డి, బుల్లయ్య (కుమార్), కొండేటి శివప్రసాద్, రెడ్డి, స్వర్ణ వెంకయ్య, నవీన్ కుమార్ రెడ్డి, మేఘనాద్ సింగ్, శ్రీకాంత్ రెడ్డి, శివ సునీల్ రెడ్డి, సురేష్ బాబు, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యేసు నాయుడు, రాజేష్, జీవీ ప్రసాద్, విజయ్ రెడ్డి,టీవీఎస్ కమల్, నరసింహరావు, వంశీ హరిబాబు యాదవ్, మధు, పవన్ కుమార్ రెడ్డి జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

చంద్రుని వైపు పయనమైన చంద్రయాన్ – 3 ప్రొపల్షన్ మాడ్యూల్

Read Next

ఈనెల 5న నెల్లూరులో చంద్రబాబు పర్యటన : వివిధ వర్గాల వారితో సమావేశం

Leave a Reply

Your email address will not be published.