
Clock Of Nellore ( Nellore ) – రామాయణం ఇతివృత్తంతో ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం ఆది పురుష్. త్రిడీలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ చూడాల్సిందే. ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఈ క్రమంలో అనాథ పిల్లలకు ఈ చిత్రాన్ని చూపించే బాధ్యతను భుజానకెత్తుకున్నారు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్. నెల్లూరు జిల్లా అర్భన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 125 మంది అనాథ పిల్లలు ఆదిపురుష్ చిత్రాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు ముక్కాల ద్వారకానాథ్. ఆదివారం ఉదయం నెల్లూరులోని ఎస్- 2 థియేటర్ లో అనాథ పిల్లల కోసం స్పెషల్ షో ఏర్పాటు చేశారు ద్వారకానాథ్. దానికయ్యే ఖర్చును పూర్తిగా ఆయనే భరాయించనున్నారు. ముక్కాల ద్వారకానాథ్ ను ప్రతీ ఒక్కరూ అభినందించాల్సిందే.