Clock Of Nellore ( Nellore ) – అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ వారు చేసే పోరాటానికి అండగా ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులోని మైపాడు గేటు సెంటర్ లో అగ్రిగోల్డ్ బాధితులు వివిధ రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటూ టిడిపి, బిజేపి, కాంగ్రెస్, జనసేన పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యి నాలుగేళ్లు పూర్తి కావస్తున్నా బాధితులకు న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బాధితులను ఆదుకోవాలని లేని పక్షంలో బాధితులు చేసే ప్రతీ పోరాటానికి తాను అండగా ఉంటానని హెచ్చరించారు.
