నెల్లూరులో రోడ్డు ప్రమాదం : ఇంటర్ విద్యార్ధి దుర్మరణం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో ప్రమాదవశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్ధి మృత్యువాత పడ్డాడు. నిండలి గ్రామానికి చెందిన చందు అనే విద్యార్ధి నెల్లూరులోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడ చదువుతూ బివి నగర్ లోని గిరిజన హాస్టలో ఉంటున్నాడు. శుక్రవారం అయ్యప్ప గుడి ఫ్లై ఓవర్ వంతెన వద్ద బైక్ పై వెళ్తూ డివైడర్ ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో చందు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్ధి మృతి పట్ల ఏపి యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి. పెంచలయ్య సంతాపం తెలియజేశారు.

Read Previous

నెల్లూరు మెడికవర్ లో బోన్ మ్యారో ట్రాన్స్ పాంట్ విభాగం : ప్రారంభించిన మంత్రి, ఎంపి

Read Next

లబ్ధిదారులకు టిడ్కో గృహాలు : కమిషనర్ వికాశ్ మర్మత్ వెల్లడి

Leave a Reply

Your email address will not be published.