మురుగునీటికి శాశ్వత పరిష్కారం : పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనీల్ పర్యటన

Clock Of Nellore ( Nellore ) – పంట కాలువ అయిన సర్వేపల్లి కాలువలో మురుగునీరు కలవకుండా వాటిని మురుగు నీటి కేంద్రాలకు మళ్లించేందుకు నగరంలోని కాలువలను పునరుద్ధరిస్తున్నామని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం ఆయన 16వ డివిజన్ లోని జగదీష్ నగర్, రాంజీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రజలు చెప్పిన మురుగునీటి సమస్య పరిష్కారం కోసం 20 లక్షలతో నిర్మించే డ్రైనేజీ కాలువల నిర్మాణాన్ని ఎమ్మెల్యే అనీల్ ప్రారంభించారు. అంతర్గత కాలువల నిర్మాణం వల్ల మురుగునీటి సమస్య తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికి కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన 39వ డివిజన్ లోని మన్సూర్ నగర్, పాముల మాన్యం ప్రాంతాల్లో పర్యటించారు. పూడిపోయిన మన్సూర్ నగర్ కాలువను పరిశీలించి పూడిక తీతకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, నాయకులు వావిలేటి ప్రసన్న, చాట్ల నరసింహారావు, మానికల సునీల్, నూనె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

Read Previous

సచివాలయాన్ని తనిఖీ చేసిన మేయర్ స్రవంతి : అర్హులకు పథకాలు చేర్చాలని ఆదేశం

Read Next

వేరు వేరు ప్రాంతాలు : ఇద్దరు అనుమానాస్పద మృతి

Leave a Reply

Your email address will not be published.