Clock Of Nellore ( Nellore ) – వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా నెల్లూరు విఆర్సీ సెంటర్ లో మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్యులు ప్రజలకు అత్యవసర సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగర ట్రాఫిక్ డిఎస్పీ అబ్దుల్ సుభాన్ హాజరవ్వగా మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగం అధిపతి డాక్టర్ కృష్ణ చైతన్య , డాక్టర్ బిందు శ్వేత , డాక్టర్ సాహిత్యరెడ్డి, డాక్టర్ కిరణ్ పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిధి అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ భద్రత అనేది ప్రతి వ్యక్తితో మొదలయ్యే సమిష్టి బాధ్యత. ఈ మధ్య కాలంలో చాలావార్తల్లో వింటూనే ఉన్నాం. రోడ్డు మీద వెళ్తూ, ఆడు కుంటూ లేక డాన్స్ చేస్తూ చనిపోవడం గమనిస్తూనే ఉన్నాం. అటువంటి అత్యవసర సమయాల్లో ఏ విధంగా స్పందించాలో దాని గురించి మనకు అవగాహన కల్పించడం ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ మరియు ట్రామా కేర్, మన స్వంత జీవితాలను మాత్రమే కాకుండా మన తోటి వారి ప్రాణాలను కూడా మనం రక్షించగలం అని డిఎస్పీ అన్నారు. అత్యవసర సమయాల్లో, ప్రతి సెకను గణించబడుతుందని, మనం చేసే సహాయం వల్ల ఒకరి ప్రాణం మరియు తనమీద అధారపడిన వారికి ఎంతో మేలు చేసినవారం అవుతాం అని, ఇది ప్రకృతి వైపరీత్యమైనా, తీవ్రమైన ప్రమాదం అయినా ప్రతిస్పందించడానికి జ్ఞానం, నైపుణ్యాలు మరియు వనరులను కలిగి ఉండటం వలన ప్రాణాలను రక్షించడంలో మరియు హానిని తగ్గించడంలో కీలకమైన మార్పు ఉంటుందన్నారు.
అత్యవసర ప్రథమ చికిత్స మరియు CPR వంటివి నేర్చుకోవడానికి వ్యక్తులను ప్రోత్సహించడం మరియు అవగాహనా కల్పించడం ఎంతో ముఖ్యం అన్నారు. ప్రజలకు అవగాహనా కలిగించే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్ వారిని డిఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఆకస్మిక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, సెప్సిస్ పాలీట్రామా అనేది ఎవరికైనా మొదటి గంటలో జరిగే చికిత్స గోల్డెన్ అవర్. ఆ సమయంలో ఎంత త్వరగా పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకొని వేళ్తే చాలా మంది బ్రతికే అవకాశం ఉంటుంది. అలా మేము చాలా మంది ప్రాణాలను రక్షించగలిగాము. ఎవరైనా అడ్మిట్ అయినట్లయితే వారికి సరైన వైద్యం అందటం వల్ల వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది మరియు వారికి ఖర్చు కూడా తక్కువ అవుతుంది అని అన్నారు. ప్రపంచ ఎమర్జెన్సీ డే వంటి కార్యక్రమాల ద్వారా, అత్యవసర సమయాల్లో చురుకైన ప్రతిస్పందన దారులుగా మారడానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర రెడ్డి, సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ నాగిరెడ్డి, రీజినల్ మార్కెటింగ్ హెడ్ ఉదయ్ భాస్కర్, సురా భాస్కర్ రెడ్డి, ఎమర్జెన్సీ టీమ్, నర్సింగ్ స్టాఫ్, మార్కెటింగ్ స్టాఫ్, మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
