Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే గాంధీ బొమ్మసెంటల్ లో ఓ కుక్క 20 మందిని గాయపర్చింది. సోమవారం సాయంత్రం పిచ్చి కుక్క గాంధీ బొమ్మ సెంటర్ లో ఒక్క సారిగా పాదచారులపై విరుచుకుపడింది. అనేక మందిని కరిచింది. విఆర్సీ సెంటర్ లో కూడా అదే కుక్క కరిచినట్లు చెబుతున్నారు. గాయపడ్డ వారంతా నెల్లూరులోని జిజిహెచ్ కు వెళ్లగా అక్కడ కుక్క కాటు వ్యాక్సిన్లు అందుబాటులో లేవని సమాచరం. మరో వైపు ఓ పేద వ్యక్తి గాంధీ బొమ్మసెంటర్ లో కుక్క కాటుకు గురి కాగా ఆయన వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ట్రాఫిక్ ఎస్తై చంద్రమౌళి ఆర్ధిక సాయం చేసి హాస్పిటల్ కు పంపించారు. మెగా సిటీగా చెప్పుకునే నెల్లూరుసిటీలోనే పిచ్చి కుక్కల స్వైర విహారం బాధాకరం.
Tags: Nellore City Nellore Dogs