స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నెల్లూరు మున్సిపల్ స్కూల్ విద్యార్ధిని

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు బివి నగర్ లో ఉన్న KNR మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్ధిని చరణి రాష్ట్ర స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించింది. ఇటీవల నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ ( NMMS ) పరీక్షకు చరణి హాజరయ్యింది. శనివారం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో చరణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంభందించి మొదటి ర్యాంకును సాధించింది. ఈ సందర్భంగా విద్యార్ధినికి జిల్లా విద్యాశాఖ అధికారిణి గంగా భవాని శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ విజయ ప్రకాష్ ను అభినందించారు.

Read Previous

మహిళల అభ్యున్నతకే చేయూత పథకం – చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కాకాణి

Read Next

మహిళ కడుపులో 6 కిలోల కణతి – సురక్షితంగా తొలగించిన మెడికవర్ వైద్యులు

Leave a Reply

Your email address will not be published.