Clock Of Nellore ( Nellore ) – ఉమ్మడి నెల్లూరుజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేసులో సర్పంచ్ నిలిచారు. పెళ్లకూరు మండలం, బంగారం పేట సర్పంచ్ దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగారు. నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రిటర్నింగ్ అధికారి కూర్మనాథ్ కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తనకు అందరూ సహకరించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.