Clock Of Nellore ( Delhi ) – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్ఠిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంభందించి మరో ప్రముఖ వ్యక్తిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఒంగోలు వైసీపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని ఈడి అధికారులు శనివారం అరెస్టు చేశారు. నిన్నటి నుండి ఢిల్లీలోని ఈడి ప్రధాన కార్యాలయంలో రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు శనివారం అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అంతే కాకుండా మరింత దర్యాప్తు కోసం ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.