Clock Of Nellore ( Udayagiri ) – నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. గత అర్ధరాత్రి ఆయన ఆత్మకూరులో ఉండగా స్వల్ప గుండెపోటుకు గురైనారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆయన్ను నెల్లూరులోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రాధమిక వైద్యం అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బుధవారం మధ్యాహ్నం చెన్నై అపోలో హాస్పిటల్ కు తరలించారు. గతంలో కూడా చంద్రశేఖర్ రెడ్డి చెన్నైలో ఉండగా ఓ సారి గుండెపోటు వచ్చింది. అప్పుడు ఆయన్ను చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. దాదాపు 2 నెలల పాటూ ఆయన హాస్పిటల్ లోనే ఉండి వైద్యం పొందారు. తర్వాత కోలుకుని నెల్లూరుకు తిరిగొచ్చారు. అప్పటి నుండి రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల నియోజకవర్గంలో తలెత్తిన వర్గ విభేధాలు, కుటుంబంలో వైరుధ్యాలు తదితర అంశాల నేపద్యంలో ఆయన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మరో సారి ఆయనకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలియజేశారు.