Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపి ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులోని వారి నివాసంలో బుధవారం రూరల్ నియోజకవర్గ ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ చైర్మన్ లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు అండగా ఉండి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతమంది ప్రజా ప్రతినిధులు మద్దతు తెలిపేందుకు వచ్చినందుకు సంతోషాన్ని ప్రకటించారు. రూరల్ నియోజకవర్గం తనకు కొత్త కాదని, ఐదేళ్లపాటు అక్కడ ముఖ్యమైన అభివృద్ధి పనులన్నీ చేశానని గుర్తు చేశారు. రూరల్ నియోజకవర్గంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, డీసీసీబి మాజీ ఛైర్మైన్ ఆనం విజయకుమార్ రెడ్డిల మద్దతు కూడా మనకు ఉందని పేర్కొన్నారు. ఎంపీ నిధులతో పాటు జడ్పీ నిధులను కూడా తెచ్చి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో రూరల్ నియోజకవర్గంలో పర్యటించి, సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, డీసీసీబి మాజీ ఛైర్మైన్ ఆనం విజయకుమార్ రెడ్డిలు మాట్లాడారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, రూరల్ నియోజకవర్గ ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, అల్లా బక్షు, నరసింహారావు, యేసు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.