ప్రజల ఆరోగ్య సంరక్షణకు నడుం బిగించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ రాష్ట్రంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇకపై నియోజకవర్గంలోని ప్రతీ ప్రాంతంలో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించి ఆవసరమైన వారికి ఉచితంగా వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేయించాలని నిర్ణయించారు. దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.

రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అనేకం చేశానని గుర్తు చేశారు. గడప గడపకి కార్యక్రమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది తానేనని, రాజకీయ కార్యకర్త తెల్ల చొక్కా వెనుక కన్నీటి కష్టం ఉంటుందని, వారి కన్నీటి శాపం నాయకునికి తగులుతుందని పేర్కొన్నారు. అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం నేను నా కార్యకర్త కార్యక్రమం చేపట్టి కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచానన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణకు శ్రీకారం చుట్టానని, పేద, మధ్య తరగతి ప్రజల కోసం అన్నీ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిభిరాలు నిర్వహించి పరీక్షలు నిర్వహించనున్నట్లు కోటంరెడ్డి తెలియజేశారు. అవసరం అయిన వారికి ఆపరేషన్లు చేయిస్తామని, గుండె, కంటి, గర్భసంచి మొదలైన ఆపరేషన్లను ఉచితంగా చేయించనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే 6 కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో చర్చించానని, 33 మంది నిపుణులైన వైద్యులు ముందుకొచ్చి సహకరించేందుకు అంగీకరించారన్నారు. రెండు స్వచ్ఛంధ సంస్థలు, కొంత మంది స్నేహితులు కూడా సహకరించేందుకు ముందుకొచ్చారని వివరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, పార్టీ జెండా, ఎజెండాలు కేవలం ఎన్నికలప్పుడేనని కోటంరెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని ప్రతీ పౌరుడు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన అభిమతమని వెల్లడించారు.

Read Previous

వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్

Read Next

నెల్లూరులో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ : ప్రారంభించిన మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.