
Clock Of Nellore ( Bangalore ) – నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులెటెన్ ను విడుదల చేశాయి. తారకరత్నకు ప్రత్యేక బృంద పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్డియాలజిస్టులు, ఇంటెన్సివిస్ట్, ఇతర స్పెషలిస్ట్ లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. వైద్య సేవలు కొనసాగుతున్నాయన్నారు. చిత్తూరుజిల్లా కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో శుక్రవారం తారకరత్న పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి రాగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గత అర్ధరాత్రి బెంగుళూరుకు తరలించారు.