రైల్వే అధికారుల అనాలోచిత నిర్ణయం : గాల్లో కలుస్తున్న ప్రాణాలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో రైల్వే అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ముగ్గురు మృత్యువాత పడగా తాజాగా శనివారం రాత్రి మరో వ్యక్తి ప్రాణం గాల్లో కలిసి పోయింది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద బోసుబొమ్మ నుండి బస్టాండ్ వెళ్లే వైపు రైల్వే ఫీడర్స్ రోడ్డు క్రాసింగ్ వద్ద ఇటీవల రైల్వే అధికారులు రోడ్డు నుండి ట్రాక్ పైకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గతంలో ఆ మెట్లు లేవు. దీంతో అటుగా ఎవ్వరూ రైల్వే ట్రాక్ దాటేవాళ్లు కాదు. తాజాగా మెట్లు నిర్మించడంతో ఎక్కువ మంది మెట్లు ఎక్కి ట్రాక్ దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బస్ స్టేషన్ లో బస్సుల రాకపోకలు, ఆటోల రణగొణులు ఎక్కువగా ఉన్న నేపద్యంలో రైలు వచ్చే శబ్ధం కూడా వినిపించే పరిస్థితి ఉండదు. దీంతో అనేక మంది రైలు వచ్చేది లేనిది గమనించకుండా ట్రాక్ దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనతోనే 10 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రైలు ఢీ కొని ముగ్గురు మృత్యువాత పడ్డారు. తాజాగా శనివారం రాత్రి మరో వ్యక్తి ట్రాక్ దాటుతూ రైలు ఢీ కొని మృత్యువాత పడ్డారు. మృతదేహం రోడ్డుపై పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

Read Previous

నిరుపేదల ఆరోగ్యానికి భరోసాగా ఆరోగ్య శ్రీ : ప్రత్యేక అధికారి డాక్టర్ అశోక్ బాబు

Read Next

ఉగాది కల్లా జగనన్న కాలనీలు సిద్ధం చేయండి : అధికారులకు మాజీ మంత్రి అనీల్ ఆదేశం

Leave a Reply

Your email address will not be published.