అన్నీ డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అన్నీ డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు 31వ డివిజన్ పరిధిలోని టైలర్స్ కాలనీలో 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణానికి మంగళవారం ఆయన శంఖు స్థాపన చేశారు. వైసీపి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు వారు శంఖు స్థాపన చేసి, నిర్ధిష్ఠ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లలో 31వ డివిజన్ లో 8 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, పూర్తి స్థాయిలో డివిజన్ అభివృద్ధికి మరో 15 కోట్లు కావాల్సి ఉందన్నారు. ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఎన్నికలప్పుడే రాజకీయాలు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికి కార్పొరేటర్ బత్తల మంజుల, ఏఎంసి ఛైర్మైన్ కూకాటి హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నిరుపేద రోగులకు అండగా… డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్…

Read Next

రాసుకోండి… నెల్లూరు నుండే మళ్లీ పోటీ… స్పష్టం చేసిన మాజీ మంత్రి అనీల్

Leave a Reply

Your email address will not be published.