3 నెలలు… 3 కీలక ప్రయోగాలు… సిద్ధమవుతున్న ఇస్రో

Clock Of Nellore ( Srihari Kota ) – భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) రానున్న 3 నెలల్లో 3 భారీ ప్రయోగాలకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు దిశా నిర్ధేశం చేశారు. ఈ నేపద్యంలో శాస్త్రవేత్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈ మూడు భారీ ప్రయోగాలను చేపట్టనున్నారు. ఈ నెలాఖరులో చిన్న ఉపగ్రహ వాహక నౌకను ( ఎస్ఎస్ఎల్వీ ), ఫిబ్రవరి నెలలో లాంచ్ వెహికల్ మార్క్ – 3 ( ఎల్వీఎం – 3 ) వాహక నౌకను, మార్చి నెలలో పిఎస్ఎల్వీ రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది. ఎల్వీఎం – 3 రాకెట్ ద్వారా వన్ వెబ్ ప్రాజెక్టుకు సంబంధించిన 36 ఉప గ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన భాగాలు ఇప్పటికే శ్రీహరికోటలోని షార్ సెంటర్ కు చేరుకున్నారు. బుధవారం నుండి రాకెట్ అనుసంధాన పనులు మొదలు కానున్నాయి. ఈ ప్రయోగాల ద్వారా వివిధ దేశాలకు చెందిన ఉప గ్రహాలను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ తరుణంలో ఈనెల 20వ తేదీ తరువాత ఆయా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు షార్ కు చేరుకోనున్నారు.

Read Previous

ఉగాది నాటికి జగనన్న గృహాలు పూర్తి : వెల్లడించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Read Next

రెవెన్యూలో అవినీతి జలగలు : ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మిన ఘనులు

Leave a Reply

Your email address will not be published.