రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డితో ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ

Clock Of Nellore ( Nellore ) – భారత రక్షణ శాఖ సాంకేతిక సలహాదారులు, నెల్లూరు వాసి గుండ్రా సతీష్ రెడ్డితో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. సంక్రాంతి పండుగకు నెల్లూరుకు వచ్చిన సతీష్ రెడ్డిని వారి నివాసంలో కోటంరెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మర్వాద పూర్వకంగానే ఈ భేటీ జరిగింది. తర్వాత పలు అంశాలపై సుమారు అరగంట పాటూ చర్చించుకున్నారు. సతీష్ రెడ్డికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Previous

ఘనంగా నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్ జన్మదిన వేడుకలు

Read Next

శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో జవాను ఆత్మహత్య

Leave a Reply

Your email address will not be published.