Clock Of Nellore ( Tirumala ) – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కాకాణి, బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షింగా ఉండాలని, సిఎం జగన్మోహన్ రెడ్డి మరో సారి ముఖ్యమంత్రి కావాలని స్వామివారిని మొక్కుకున్నట్లు పేర్కొన్నారు.
