Clock Of Nellore ( Kuwait ) – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం గల్ఫ్ దేశాల్లో ఘనంగా జరిగాయి. ఆయా దేశాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ నేతలు, సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా కేక్ లు కట్ చేసి, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దుబాయ్ లో వైసీపి రీజనల్ కో – ఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా కేట్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జగన్ పరిపాలనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పడాల బ్రహ్మానందరెడ్డి, తరపట్ల మోహన్, అక్రం, కోటేశ్వర రెడ్డి, కర్ణ, మహేష్, శివలింగారెడ్డి, నరసింహ, బాషా, షాకీర్, అంజాద్, హరి, సత్య, విజయ, భామా, క్రాంతి పాల్గొన్నారు.

ఖతర్ లోనూ జగన్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఖతర్ వైసీపి కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో దోహా సిటీలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపి గల్ఫ్ ప్రతినిధి మండా వర్జిల్ బాబు, ఎస్సీ, ఎస్టీల విభాగం ఇంఛార్జ్ జయరాజ్, నేతలు మోహన్ రెడ్డి, జస్వంత్ రెడ్డి, శివనారాయణ, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపి గల్ఫ్ కన్వీనర్ బి.హెచ్. ఇలియాజ్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. కడపలో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం బి.హెచ్. ఇలియాజ్ మాట్లాడుతూ వైసిపి కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో కూడా వేడుకలు జరిగాయని పేర్కొన్నారు. ప్రవాస ఆంధ్రుల కోసం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ స్థాపించిన మహా నేత జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఛైర్మైన్ మేడపాటి వెంకట్ ఆధ్వర్యంలో ప్రవాస ఆంధ్రుల క్షేమం, సంక్షేమం కోసం APNRTS పనిచేస్తుందని తెలియజేశారు. ఈ సమాచారాన్ని వైసీపి గల్ఫ్ దేశాల మీడియా కో- ఆర్డినేటర్ షేక్ గౌస్ బాషా తెలియజేశారు.
