గిరిజన కుటుంబాలకు అండగా ఉంటా : ఆర్ధిక సాయం అందజేసిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Venkata Chalam ) – సర్వేపల్లి నియోజకవర్గంలో జగనన్న ఇళ్లు మంజూరైన గిరిజనులకు అండగా ఉండి, సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కాకాణి పాల్గొని జగనన్న ఇంటి నిర్మాణ పధకం క్రింద ఎస్టి లబ్ధిదారులకు ఆర్ధిక చేయూత కింద ఒక్కొక్క లబ్ధిదారునికి 15 వేల రూపాయల వంతున చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్.సి.,ఎస్.టి., బి.సి, మైనారిటీ వర్గాలకు అండగా వుంటూ, వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. పేదవాని సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి ఇంటి పట్టాల మంజూరుతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 1.80 లక్షల రూపాయలు వంతున ఇంటి నిర్మాణం నిమిత్తం ఆర్ధిక సహాయం అందచేస్తున్నప్పకి, సర్వేపల్లి నియోజకవర్గంలో ఆర్ధికంగా వెనుకబడిన ఎస్.టి లబ్ధిదారులను గుర్తించి, వారు త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అదనంగా మరో 15 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.

ప్రతి గిరిజన కుటుంబం త్వరగా ఇల్లు నిర్మించుకునేందుకు దాతలు సహకారం, సిఎస్ఆర్ నిధులతో ఒక్కొక్క కుటుంబానికి 15 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందని మంత్రి వివరించారు. వెంకటాచలం మండల పరిధిలో మొదట విడతలో 159 మంది ఎస్టి లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేయగా, రెండో విడతలో ఈరోజు 12 గ్రామాలకు చెందిన 122 ఎస్.టి గృహ నిర్మాణ లబ్ధిదారులకు 15 వేల రూపాయల వంతున అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చిన ప్రతి గిరిజన కుటుంబానికి ఇంటిని పూర్తి చేయించి, గృహప్రవేశం చేసేంతవరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయంతో పాటు అదనంగా అందచేస్తున్న 15 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని మంత్రి ఈ సంధర్భంగా ఎస్.టి లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మలోల, ఎంపీడీవో సుస్మిత, తహసీల్దార్ నాగరాజు, గృహ నిర్మాణ శాఖ డిఈ వరప్రసాద్, ఏఇ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఎస్టి గృహ నిర్మాణ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో రేపు ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు : ఏర్పాట్లు పరిశీలించిన కోటంరెడ్డి

Read Next

ఈనెల 28 నుండి చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన

Leave a Reply

Your email address will not be published.