Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ లో నూతనంగా నిర్మించిన హోటల్ తేజస్విని గ్రాండ్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి పలువురు సినీ తారలు హాజరయ్యి సందడి చేశారు. సొట్టబుగ్గల భామలు కృతిశెట్టి, హెబ్బాపటేల్, సిమ్రాన్ చౌదరితో పాటు బిగ్బాస్ ఫేం లు అషురెడ్డి, సిరి, అరియానా గ్లోరీ, హిమజ, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, యాంకర్ శ్యామల, కార్తీకదీపం సీరియల్ నటుడు నిరుపం పాల్గొన్నారు. బాలకృష్ణ , చిరంజీవి, పవన్ కల్యాణ్ డైలాగులతో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి ఉర్రూతలూగించారు. తారలను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
