వేలంతో మా పొట్ట కొట్టవద్దు : కండలేరులో జలదీక్ష చేపట్టిన గిరిజనులు

Clock Of Nellore ( Rapur ) – నెల్లూరుజిల్లాలోని కండలేరు జలాశయంలో యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు జలదీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కండలేరు జలాశయంలో అనాదిగా స్థానిక సొసైటీ ద్వారా తాము చేపలు పట్టుకుంటున్నామని, అయితే ప్రభుత్వం జలాశయంలోని చేపలను పట్టుకునేందుకు తాజాగా వేలం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వేలం వేస్తే చేపల వేట హక్కు ఎవరో ఒకరికే దక్కుతుందన్నారు. చేపల వేటే ఉపాధిగా ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న తమకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం వేలం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, చేపల వేట స్థానిక సొసైటీకే అప్పగించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న 80 శాతం మంది గిరిజనులు కండలేరులో చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సి. పెంచలయ్య ఈ సందర్భంగా తెలియజేశారు.

Read Previous

ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని అందుకున్న నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

Read Next

నెల్లూరు జిల్లా పోలీసు శాఖకు 6 బొలెరో వాహనాలు : అందజేసిన కందుకూరు ఎమ్మెల్యే

Leave a Reply

Your email address will not be published.