Clock Of Nellore ( Srihari Kota ) – భారత అంతరిక్షయాన రంగంలో అద్భుత ఘట్టం ఆవిష్క్రృతమైంది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి దీసుకెళ్లింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ థవర్ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగానికి వేదికైంది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు షార్ లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుండి తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్ – ఎస్ నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం అయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ విక్రమ్ – ఎస్ రాకెట్ ను అభివృద్ధి చేసింది. ఈ మొట్ట మొదటి మిషన్ కు ప్రారంభ్ అని నామకరణం చేశారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ హాజరయ్యారు. వాస్తవానికి ఈనెల 12నే ప్రయోగం చేపట్టాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది. విక్రమ్ – ఎస్ రాకెట్ సింగిల్ స్టేజ్ సబ్ – ఆర్భిటల్ లాంచ్ వెహికల్ కావడం విశేషం. ఈ రాకెట్ మూడు చిన్నపాటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.
