Clock Of Nellore ( Nellore ) – రెండు రోజుల విరామం తర్వాత గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గురువారం 35వ డివిజన్ లోని లేక్ వ్యూ కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు కోటంరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యాకసిరి వాసంతి, డివిజన్ వైసీపి అధ్యక్షులు యాకసిరి శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
