Clock Of Nellore ( Nellore ) – భారత నౌకాదళ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత నేవీ షిప్ సుకన్య నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు రానుంది. ఈనెల 18న ప్రజల సందర్శనార్ధం ఆ షిప్ ను పోర్టులో ఉంచనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ సుకన్య షిప్ ను ప్రజలు చూసేందుకు భారత నేవీ దళ అధికారులు అవకాశమిచ్చారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులతో పాటూ సాధారణ ప్రజలు కూడా ఈ నౌకను తిలకించవచ్చునని నేవీ అధికారులు తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ఠ్యా మహిళలు హ్యాండ్ బ్యాగులు, పర్సులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

Tags: adhani krishnapatnam port Indian Navy Day Indian Navy sukanya ship krishnapatnam port Nellore Krishnapatnam port