నెల్లూరు అపోలో హాస్పిటల్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు‌. చిల్డ్రన్స్ డే వేడుకల్లో భాగంగా అపోలో ప్రాంగణం పిల్లల ఆట పాటలతో సందడిగా మారింది. శిశు వైద్యులు, సిబ్బంది, నర్సులు పిల్లలతో ఆడిపాడారు. అపోలో ఆసుపత్రి చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ రూప, డాక్టర్ రఫీ పిల్లల ఆరోగ్యం గురించి పలు సూచనలను తల్లిదండ్రులకు అందించారు. అనంతరం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని అన్నారు. వారికి చిన్నతనం నుంచే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని తెలిపారు. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులపై ఉందని వారికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల పైనే ఉందని, ప్రతి తల్లి, తండ్రి కూడా పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక దృష్టి సాధించాలని అన్నారు.ఈ వేడుకలలో అపోలో ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు అష్ఠ దిగ్భంధనం : భారీగా వరద నీరు, ప్రజలకు తప్పని పాట్లు

Read Next

అపోలో హాస్పిటల్ లో కిడ్నీ రాళ్లకు అత్యాధునిక లేజర్ చికిత్స

Leave a Reply

Your email address will not be published.