పొదలకూరురోడ్డులో దారుణం : యువకుడు దారుణ హత్య

Clock Of Nellore ( Nellore ) – వరుస నేరాలతో నెల్లూరు నగరం వణుకుతోంది. రోజూ ఏదో ఒక ప్రాంతంలో నేర ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మంగళవారం దర్గామిట్టలోని టూరిజం హోటల్ వద్ద ఓ రౌడీ షీటర్ ను నడిరోడ్డుపై హత్య చేయగా, తాజాగా బుధవారం పొదలకూరు రోడ్డులో మరో హత్య ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తిని ఎక్కడో బయట హత్య చేసి అతని మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి ఆ గోనె సంచిని గౌతమ్ నగర్ రామచంద్ర మిషన్ వద్ద పడేసి వెళ్లారు. స్థానికులు దాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని గోనె సంచిలో నుండి బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. హత్య కాబడ్డ వ్యక్తి ఎవరనే దానిపై విచారణ చేపడుతున్నారు. బయట ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఈ ప్రాంతంలో పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

నెల్లూరుజిల్లాలో విస్తారంగా వర్షాలు : వాగులో చిక్కుకున్న కారు

Read Next

ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నింటికి పరిష్కారం : జడ్పీ సమావేశంలో మంత్రి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.