నెల్లూరు AMC ఛైర్మైన్ గా కూకటి హరిబాబు యాదవ్ నియామకం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటి ఛైర్మైన్ గా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన కూకటి హరిబాబు యాదవ్ నియమితులైనారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు కూకటి హరిబాబు యాదవ్ ను ఛైర్మైన్ గా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటూ వైస్- ఛైర్మైన్ గుండాల మధుసూదన్ రెడ్డిని నియమించారు. వీరితో పాటూ మరో 13 మందిని కమిటిలో సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు వెలువడిన నేపద్యంలో ఛైర్మైన్ హరిబాబు యాదవ్ కోటంరెడ్డి సోదరులను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి హరిబాబు యాదవ్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

Read Previous

ఇంతకీ ఎవరీ యువతి : అర్ధరాత్రి అడవిలో ఏం పని ?

Read Next

రేపే సిఎం జగన్ నెల్లూరు పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

Leave a Reply

Your email address will not be published.