స్పెషల్ బ్రాంచ్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన మధుబాబు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ గా మధుబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీ విజయరావును మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. చిన్నబజార్ సిఐగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించిన మధుబాబు సాధారణ బదిలీల్లో భాగంగా సిసిఎస్ కు అక్కడి నుండి బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ సిఐగా నియమితులై తనదైన ముద్రను వేసుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు అత్యున్నతమైన స్పెషన్ బ్రాంచ్ కు బదిలీ చేశారు. శనివారం స్పెషన్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకుని అనంతరం ఎస్పీని కలిశారు. మరో వైపు విఆర్ లో ఉండి బాలాజీ నగర్ సిఐగా నియమితులైన రాములు నాయక్ కూడా శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు.

Read Previous

బీ ఫార్మసీ విద్యార్ధులకు న్యాయం చేయండి : ఆందోళన చేపట్టిన TNSF, ABVP

Read Next

భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయండి : ఆర్డీఓలకు కలెక్టర్ ఆదేశం

Leave a Reply

Your email address will not be published.