అపోలో హాస్పిటల్ లో 999 రూపాయలకే మోకాళ్ల స్క్రీనింగ్ క్యాంప్

  • అపోలో హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో ఆర్థ‌రైటిస్ డే
  • చిల్డ్ర‌న్స్ పార్క్ నుంచి అపోలో హాస్పిట‌ల్ వ‌ర‌కు వాక్‌తాన్
  • ముఖ్య అతిధులుగా హాజ‌రైన అడిష‌న‌ల్ ఎస్పీ, డిఎమ్ అండ్ హెచ్‌.ఓ,ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ మదన్మోహన్ రెడ్డి
  • కేవ‌లం 999 రూపాయ‌ల‌కే మోకాళ్ల స్క్రీనింగ్ క్యాంప్‌

Clock Of Nellore ( Nellore ) – వ‌ర‌ల్డ్ ఆర్థ‌రైటిస్ దినోత్సవాన్ని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు చిల్డ్ర‌న్స్ పార్క్ నుంచి అపోలో హాస్పిట‌ల్ వ‌ర‌కు వాక్తాన్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి నెల్లూరు జిల్లా అదనపు ఎస్పీ హిమ‌వ‌తితోపాటూ జిల్లా వైద్యశాఖాధికారి పెంచ‌ల‌య్య‌, ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ అశోక్, డాక్టర్ మల్లికార్జున్ మరియు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంత‌రం అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో వ‌ర‌ల్డ్ ఆర్థ‌రైటిస్ డే సంద‌ర్భంగా హాస్పిట‌ల్ నిర్వాహ‌కులు అందిస్తున్న ప్ర‌త్యేక ప్యాకేజీ బ్రోచ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆర్థ‌రైటిస్ డే సంద‌ర్భంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో మోకాళ్ల‌కు సంబంధించి ఎంతో విలువైన యూరిక్ యాసిడ్‌, సి.బి.సి, ఆర్‌.బి.సి, క్రియాటిన్‌, ఎక్స్‌రే ప‌రీక్ష‌ల‌ను కేవ‌లం 999 రూపాయ‌ల‌కే అందిస్తున్నారు. దీనితోపాటూ డాక్ట‌ర్ క‌న్సెల్టేష‌న్‌ను కూడా ఉచితంగా అందిస్తున్న‌ట్లు అపోలో వ‌ర్గాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో అపోలో హాస్పిట‌ల్ సీనియ‌ర్ క‌న్సెల్టెంట్‌, ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి, అపోలో హాస్పిట‌ల్స్ స‌ద‌ర‌న్ రీజియ‌న్ వైస్ ప్రెసిడెంట్ న‌వీన్‌, హాస్పిట‌ల్ మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ శ్రీ‌రామ్ స‌తీష్‌, డాక్ట‌ర్ వివేకానంద‌రెడ్డి, డాక్ట‌ర్ శ‌శిధ‌ర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

సమస్యలపై స్పందించిన వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Read Next

సిఎం సహకారంతో ముస్లిం సంక్షేమానికి నిరంతర కృషి : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.