బోన్ క్యాన్సర్ కు రెయిన్ బో హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్ విజయవంతం

Clock Of Nellore ( Nellore ) – బోన్ క్యాన్సర్ తో బాధపతున్న వ్యక్తికి అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించినట్లు నెల్లూరులోని రెయన్ బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పేనేటి సునీల్ కుమార్ తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తిగా క్యాష్ లెస్ విధానంలో ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. నెల్లూరులోని రెయన్ బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో శనివారం బోన్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వై. అనీల్ కుమార్ తో కలిసి డాక్టర్ పేనేటి సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాకు చెందిన కిరణ్ అనే వ్యక్తి మోకీళ్ల వద్ద నొప్పులతో నడవలేని స్థితిలో తమ వైద్యశాలకు రాగా బోన్ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ వై. అనీల్ కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించగా Fibroxanthoma అనే అరుదైన బోన్ కాన్సర్ వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఆ క్యాన్సర్ ను పూర్తిగా రూపుమాపేందుకు ఉన్న అవకాశాల్లో భాగంగా అరుదైన ఆపరేషన్ ను వారి కుటుంబసభ్యుల అంగీకారంతో డాక్టర్ వై. అనీల్ కుమార్ విజయవంతంగా నిర్వహించారన్నారు. పూర్తిగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

రెయిన్ బో హాస్పిటల్ లో అత్యాధునిక క్యాన్సర్ నివారణ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య పరికరాలు కూడా ఉన్నాయన్నారు. ఒక్క క్యాన్సర్ వ్యాధికే కాకుండా అన్నీ విభాగాలకు మెరుగైన వైద్యం అందించే వైద్యుల బృందం రెయిన్ బో లో అందుబాటులో ఉందని, ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బోన్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వై. అనీల్ కుమార్ మాట్లాడుతూ బోన్ క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చునని తెలియజేశారు. అనంతరం క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకున్న కిరణ్ మాట్లాడుతూ డాక్టర్ అనీల్ కుమార్ ఎంతో శ్రమించి తనకు ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించాలని, అది కూడా పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా చేశారని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రెయిన్ బో హాస్పిటల్ వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Read Previous

పింఛన్ల తొలగింపుతో కష్టాల్లో వృద్దులు : కేతంరెడ్డి ఆరోపణ

Read Next

సమస్యలపై స్పందించిన వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published.