Clock Of Nellore ( Chillakur ) – ఉమ్మడి నెల్లూరుజిల్లా చిల్లకూరు మండలం, ఓడూరు గ్రామంలో విద్యుతాఘాతానికి గురై విహహిత మృత్యువాత పడింది. పారిచర్ల మాధవి అనే మహిళ శనివారం ఇంట్లో తడిగుడ్డుతో ఫ్లోరింగ్ ను శుభ్రపరుస్తుండగా ఫ్లోరింగ్ ను ఆనుకుని ఉన్న టేబుల్ ఫ్యాన్ వైర్లు ఆమెకు తగిలాయి. దీంతో ఆమె విద్యుత్ షాక్ కు గురైంది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిరాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.