Clock Of Nellore ( Jonnawada ) – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, తమిళనాడు రాష్ట్ర వాసి కృష్ణమూర్తి వైద్యనాథన్ సతీసమేతంగా శుక్రవారం నెల్లూరుజిల్లాలోని జొన్నవాడ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఆలయానికి వెళ్లగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులతో పాటూ నెల్లూరు ఆర్డీఓ మలోల స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి కృష్ణమూర్తి వైద్యనాథన్ దంపతులు కామాక్షితాయి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. జొన్నవాడ క్షేత్రాన్ని దర్శించడం ఆనందంగా ఉందని కృష్ణమూర్తి వైద్యనాథన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి తహసీల్ధార్ ప్రమీల, ఆలయ ఛైర్మైన్ పుట్టా లక్ష్మీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.