12వ డివిజన్ లో పర్యటించిన మేయర్ స్రవంతి – సమస్యలపై ఆరా

Clock Of Nellore ( Nellore ) – “శ్రీధరన్న మాట – గడప గడపకు మీ కార్పొరేటర్ బాట” కార్యక్రమాన్ని నెల్లూరు 12 వ డివిజన్ వావిలేటిపాడులో బుధవారం నగర మేయర్ స్రవంతి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆ ప్రాంతానికి చేరుకున్న మేయర్ దంపతులకు స్థానిక వై.సి.పి. నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పూలమాలలు, శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. గడప గడపకు పర్యటనలో భాగంగా డివిజన్ లోని ప్రజలతో మేయర్ ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు అందిస్తున్న సేవలను ప్రతి ఇంటికి తిరిగి విచారించారు. అనంతరం మేయర్ స్రవంతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలన అమలు తీరును నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వై.సి.పి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాలతో ప్రజలందరినీ కలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థను సద్వినియోగం చేసుకుని అర్హులైన ప్రతిఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలని మేయర్ సూచించారు. సంక్షేమ పథకాల అమలులో సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు అందిస్తున్న సేవలు అత్యంత కీలకమని, స్థానిక సమస్యల పరిష్కారానికి వారు చేస్తున్న కృషి అభినందనీయమని మేయర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వై.సీ.పీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Read Previous

ఇసుక టిప్పర్ ఢీ – అంగన్ వాడీ టీచర్ మృత్యువాత

Read Next

లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సీతారాంపురం ఎమ్మార్వో

Leave a Reply

Your email address will not be published.