Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తవనున్నాయని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ తెలిపారు. మరో ఏడాదిలోగా నెల్లూరు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన నగరంగా రూపాంతరం చెందనుందని అన్నారు. 13వ డివిదన్ పరిధిలోని గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో 30 లక్షల రూపాయలతో నిర్మించే సిసి రోడ్డు పనులకు మంగళవారం అనీల్ శంఖు స్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా పూర్తి అవుతున్నాయని, త్వరలోనే పనులన్నీ పూర్తవుతాయని అన్నారు. నెల్లూరు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, ఇతర డివిజన్ల కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, కిన్నెర ప్రేమ్ కుమార్, వైసీపి నేతలు ఊటుకూరు చంద్ర, నారాయణ ముదిరాజ్ పాల్గొన్నారు.
