వైద్య రంగంలో విప్లవాత్మకం రోబోటిక్ సర్జరీ : అపోలో హాస్పిటల్ లో 1500 పైగా సర్జరీలు

  • వైద్య‌రంగంలో విప్ల‌వాత్మ‌క‌త‌కు శ్రీ‌కారం రోబోటిక్ స‌ర్జ‌రీ
  • మోకాలు, తుంటి మార్పిడిలో కీల‌కం
  • అన్నీ రోబోటిక్ స‌ర్జ‌రీలు ఒకేలా ఉండ‌వు
  • రోబోటిక్ స‌ర్జ‌రీ గురించి రోగి ప‌లు విష‌యాలు తెలుసుకోవాలి
  • దిగ్విజయంగా 1500 పైగా మోకాలి శస్త్ర చికిత్సలు పూర్తి చేసినట్లు వెల్లడి
  • రోబోటిక్ స‌ర్జ‌రీ సాంకేతిక‌త గురించి వివ‌రించిన చెన్నై అపోలో వైద్యులు డాక్ట‌ర్ మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – చెన్నై అపోలో సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో ఆర్థోపెడిక్ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, డాక్ట‌ర్ మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి అత్యాధునిక రోబోటిక్ – ఆర్మ్ అసిస్టెడ్ మోకాలి మార్పిడి సాంకేతికత గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆదివారం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో అపోలో ఆసుపత్రి సదరన్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ మరియు కీళ్లు, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పమ్మి కార్తీక్ రెడ్డి, డాక్టర్ వివేకానంద రెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి, డాక్టర్ పృథ్వి, అపోలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రోబోటిక్ స‌ర్జ‌రీ ప్ర‌పంచ వ్యాప్తంగా వైద్య‌ రంగంలో ఓ విప్ల‌వంగా మారింద‌ని అన్నారు. గ‌త కొనేళ్లుగా ఈ రోబోటిక్ స‌ర్జ‌రీ అత్యాధునిక ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌రిష్కారాల‌ను అందిస్తూ రోగుల జీవితాల‌ను మారుస్తుంద‌ని అన్నారు. మోకాలి, తుంటి మార్పిడి శ‌స్త్ర‌ చికిత్స‌లో అధిక ఖ‌చ్చిత‌త్వంతో పాటూ సాంప్ర‌దాయ సాంకేతిక‌త‌ను అందిస్తూ రోగి ప‌రిస్థితుల‌ను గ‌ణ‌నీయంగా మెరుగుపర‌చ‌డంలో ఈ రోబోటిక్ స‌ర్జ‌రీ ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని అన్నారు. స‌ర్జ‌రీ చేసే వైద్యులు శ‌స్త్ర‌చికిత్స గురించి స‌రైన నిర్ణ‌యం, అత్యంత ఖ‌చితత్వంతో చికిత్స అందించేందుకు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పారు. టెక్నాల‌జీ ద్వారా రోబోటిక్ స‌ర్జ‌రీని వైద్యులు నిర్వ‌హిస్తార‌ని, వైద్యులు ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌నం ద్వారానే ఇది ప‌ని చేస్తుంద‌ని అన్నారు.

అన్నీ రోబోటిక్ స‌ర్జ‌రీలు ఒకేలా ఉండ‌వు – డాక్ట‌ర్ మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి
అన్నీ ర‌కాల రోబోటిక్ టెక్నాల‌జీలు ఒకేలా ఉండ‌వ‌ని డాక్ట‌ర్ మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మార్కెట్‌లో వివిధ రోబోటిక్ టెక్నాల‌జీలు అందుబాటులో ఉన్నాయ‌ని, ఒక‌ దానికి మ‌రొక‌టి భిన్నంగా ఉంటాయ‌ని అన్నారు. రోబోటిక్స్ స‌ర్జ‌రీ చేయించుకోవాల‌నుకునే వారు ముందుగా ఈ ర‌క‌మైన స‌ర్జరీ విష‌యంలో ఆ హాస్పిట‌ల్ చ‌రిత్ర‌తో పాటూ ఎఫ్‌.డి.ఏ ఆమోదం, క్లినిక‌ల్ లెగ‌సీ, గ‌తంలో ఆ హాస్పిట‌ల్‌లో జ‌రిగిన రోబోటిక్స్ స‌ర్జరీల వివ‌రాలు తెలుసుకోవ‌డం మంచిద‌ని సూచించారు. అలాగే నెల్లూరు అపోలో ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1500 పైగా మోకాలి శస్త్ర చికిత్సలు పూర్తి చేసిన సందర్భంగా ఆయన ఆర్థో విభాగపు వైద్యులను అభినందించారు.

రోబోటిక్ – ఆర్మ్ అసిస్టెడ్ మోకాలి మార్పిడి ఎంతో ఖ‌చ్చిత‌మైన‌ది…
సాధార‌ణంగా సాంప్ర‌దాయ మోకాలి మార్పిడిలో స‌ర్జ‌న్ సంప్ర‌దాయ సాధ‌నాల‌పై ఆధార‌ప‌డుతార‌ని, ఇందుకోసం ప్ర‌త్యేక శ‌స్త్ర చికిత్స ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించి, మోకాలి మార్పిడి అమ‌రిక‌ను అంచ‌నా వేసి శ‌స్త్ర చికిత్స చేస్తార‌ని డాక్ట‌ర్ మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు. ఇది వైద్యుడి నైపుణ్యంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అన్నారు. అయితే ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చిన రోబోటిక్స్ స‌ర్జ‌రీ ద్వారా త్రీడి సిటి ఆధారిత సీటి వ‌ర్చువ‌ల్ ప్లాన్ స‌హాయంతో స‌ర్జ‌న్ ఓ ప్ర‌ణాళిక‌ బ‌ద్దంగా ఆప‌రేష‌న్ చేస్తార‌ని అన్నారు. దీని వ‌ల్ల ఎముక‌ల‌లో ఉన్న లోపాలు కూడా తెలుస్తాయ‌ని తెలిపారు. ఇది ఖ‌చ్చితత్వంతో కూడుకున్న ఆప‌రేష‌న్‌కు ఉప‌క‌రిస్తుంద‌ని, దీని వ‌ల్ల రోగి ఇత‌ర క‌ణ‌జాలాలు దెబ్బ‌తిన‌కుండా ఉండ‌టంతో పాటూ, రోగికి గాయం శాతం త‌గ్గించి, త్వ‌ర‌గా కోలుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, వెల్ల‌డించారు. సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల‌తో పోలిస్తే ఈ రోబోటిక్స్ ఆప‌రేష‌న్ ఎంతో సుర‌క్షిత‌మ‌ని, ఖ‌చ్చిత‌మైన మోకాలి మార్పిడి అమ‌రిక జ‌రుగుతుంద‌ని చెన్నై అపోలో సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో ఆర్థోపెడిక్ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్‌, డాక్ట‌ర్ మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Read Previous

35వేల ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నా – వెల్లడించిన కేతంరెడ్డి

Read Next

రేపటి నుండి నవరాత్రి ఉత్సవాలు – ఆలయంలోనే ఉంటానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.