Clock Of Nellore ( Nellore ) – శుక్రవారం అర్ధరాత్రి నెల్లూరు నగరం హాయిగా కునుకు తీస్తుంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా రెండు ప్రాంతాల్లో అలజడి రేగింది. చిమ్మ చీకటిని చీల్చేస్తూ ఎర్రటి రక్తం విరజిమ్మింది. ఏమైందో తెలుసుకునేలోగా ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. వివరాల్లో కెళ్తే… నగర శివారు కల్లూరుపల్లి సాయిబాబా మందిరం వెనుక ఒక నివాసంలో నవాబుపేట కుసుమ హరిజన వాడకు చెందిన మన్నేపల్లి మోషే దారుణ హత్యకు గురైనాడు. ఈ హత్య వివాహేత సంబంధం నేపద్యంలో సాగిందని అనుమానపడ్డ పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపి ఉదయం కల్లా నిందితుణ్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు. హతుడు మన్నేపల్లి మోషాకు వివాహమైంది. ప్రస్తుతం భార్యను వదిలేసి ఉన్నాడు. ఈ క్రమంలో ఆవుల జ్యోతి అనే మహిళతో వివాహేత సంబంధం పెట్టుకుని కల్లూరుపల్లిలో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. గతంలో జ్యోతితో అక్రమ సంబంధం కొనసాగించి సహజీవనం చేసిన కుసుమ హరిజన వాడకు చెందిన పాత నేరస్తుడు మర్లపాటి ప్రదీప్ కు ఈ విషయం తెలిసి అతనిపై కక్ష్య పెంచుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి కల్లూరుపల్లికి వెళ్లి జ్యోతి ఎదురుగానే మోషాను హత్య చేశాడు. తనతో గడిపిన జ్యోతిని, మోషా అనుభవించడం జీర్ణించుకోలేకే హత్య చేసినట్లు ప్రదీప్ పోలీసులకు చెప్పాడు. నెల్లూరు రూరల్ పోలీసులు ప్రదీప్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
మరో వైపు గత అర్ధరాత్రి సమయంలో నగరంలోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మరో హత్య జరిగింది. స్థానిక సిఏఎం హైస్కూల్ ఆవరణంలో సుల్తాన్ అనే ముజావర్ ను గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. హైస్కూల్ ఆవరణంలో ఉన్న చిన్న దర్గాలో ముజావర్ గా సుల్తాల్ ఉంటూ ఉండేవాడు. ఈ కేసులో పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో హత్య చేసింద ఖాజా అని తేలింది. ఇటీవల హైస్కూల్ ఆవరణంలో అసాంఘీక కార్యక్రమాలు చేస్తుండగా ముజావర్ సుల్తాన్ అతన్ని మందలించి పంపినట్లు తెలిసింది. దాంతో అతనిపై కక్ష్య పెంచుకున్న ఖాజా గత రాత్రి హత్య చేసినట్లు తెలిసింది. ఖాజా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.