Clock Of Nellore ( Nellore ) – బుధవారం నుండి వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపద్యంలో నెల్లూరు నగరంలో సందడి వాతావరణం నెలకొంది. గణేష్ విగ్రహాలు, పూజా సామాగ్రి విక్రయాలతో నగర రోడ్లు కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వేళ నగరంలో సందడి వాతావరణం దర్శనమిచ్చింది. ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి గణేష్ విగ్రహాలు, పూజా సామాగ్రి కొనుగోలు చేశారు. ఆ దృశ్యాలను క్లాక్ ఆఫ్ నెల్లూరు న్యూస్ ప్రతినిధి తన కెమరాలో క్లిక్ మనిపించారు. అవే ఈ దృశ్యాలు.
