ఈనెల 30న నెల్లూరుకు సిఎం జగన్ : సంగం, నెల్లూరు బ్యారేజీల ప్రారంభోత్సవం

Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల 30వ తేదీనా నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీతో పాటూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నూతనంగా నిర్మితమైన నెల్లూరు బ్యారేజీని ప్రారంభించనున్నారు. సిఎం రాక నేపద్యంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి ఏర్పాట్లపై చర్చించారు. సంగం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన మేకపాటి గౌతంరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను కూడా సిఎం ఆవిష్కరించనున్నారు. సిఎం పర్యటన వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Read Previous

శ్రీవారి అభిషేక సేవతో పులకించిన నెల్లూరు భక్తజనం…

Read Next

నిర్విగ్నంగా సాగుతున్న పవనన్న ప్రజాబాట – 6 డివిజన్లలో పూర్తి

Leave a Reply

Your email address will not be published.