నెల్లూరుజిల్లాలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

Clock Of Nellore ( Buero Report ) – నెల్లూరు జిల్లాలో శనివారం మధ్యాహ్నం తర్వాత భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. జిల్లాలోని దుత్తలూరు, ఉదయగరి, కొండాపురం,వింజమూరు, వరికుంటపాడు తదితర గ్రామాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించగా.. పామూరులో కూడా సుమారు 3 సెకన్ల పాటు భూమి కంపించింది. దీనిపై అధికారులు పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది.

Read Previous

ఆనం ఇంట హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు – ఒకే వేదికపై ఆనం సోదరులు

Read Next

ఈనెల 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు : ఏర్పాట్ల పరిశీలన

Leave a Reply

Your email address will not be published.