Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మినీ బైపాసులోని హరనాధపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైను కాలువల నిర్మాణం, సర్వేపల్లి కాలువ అభివృద్ధి పనులను నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. కార్పొరేషన్ కమిషనర్ హరిత, ఇతర అధికారులతో కలిసి ఆయా పనులను తనిఖీ చేశారు. పనులు అత్యంత నాణ్యతతో జరిగేలా అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని వారు సూచించారు. సర్వేపల్లి కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కాలువల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి డివిజన్ లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు వేలూరు మహేష్, కర్తం ప్రతాప్ రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
