Clock Of Nellore ( Kavali ) – నెల్లూరుజిల్లా కావలి సమీపంలోని గౌరవరం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కావలి డిపో నుండి 35 మంది ప్రయాణీకులతో ఏఎస్ పేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన కారు ముందు వైపు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా అందులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. మరో వైపు కారు వేగంగా బస్సు ముందు భాగాన్ని ఢీ కొట్టడంతో, బస్సు అదిరి డ్రైవర్ కింద పడ్డాడు. దీంతో బస్సు డ్రైవర్ లేకుండా కొద్ది దూరం ముందుకెళ్లి నిలిచిపోయింది. బస్సులోని 15 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వారిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Car Accident kavali news